: ‘ఏపీలో విమానాశ్రయాల పేర్ల మార్పు’ తీర్మానానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం, రేణిగుంట విమానాశ్రయాల పేర్లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. గన్నవరం విమానాశ్రయాన్ని ఎన్టీఆర్ విమానాశ్రయంగా, అలాగే రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేర్లు మార్చనున్నారు. ఈ తీర్మానానికి శాసన మండలి ఆమోదం తెలిపింది.