: రామ మందిరంపై సుప్రీంకోర్టు సూచనను స్వాగతించిన కేంద్ర మంత్రి ఉమాభారతి
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరగానే మరోసారి పెద్ద ఎత్తున అయోధ్యలో రామమందిరం అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక రూలింగ్ ఇస్తూ... ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకోవాలని సూచించిన అంశంపై కేంద్ర మంత్రి ఉమాభారతి స్పందించారు. సుప్రీంకోర్టు సూచనను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కోర్టు బయట రామమందిరం సమస్య పరిష్కారం అవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ నేతలు స్పందిస్తూ అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించాలని అంటున్నారు.