: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే తొలిసారిగా నెంబ‌ర్‌.1గా జడేజా


ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. నిన్న రాంచీలో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్టులో రాణించిన జడేజా నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. నిన్నటి వరకు ఆ జాబితాలో 892 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో అశ్విన్ ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, మూడో టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను తీశాడు. మ‌రోవైపు అశ్విన్ అంత‌గా రాణించ‌లేదు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అశ్విన్‌కి కేవలం రెండు వికెట్లు మాత్రమే ద‌క్కాయి.

ఇక‌, జడేజా 899 పాయింట్లు దక్కించుకుని అశ్విన్‌ను వెన‌క్కినెట్టి త‌న కెరీర్‌లోనే తొలిసారిగా నెంబ‌ర్‌ 1గా నిలిచాడు. కాగా, ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్‌ జాబితాలో అశ్విన్‌ రెండవ స్థానంలో, జడేజా మూడో స్థానంలో ఉన్నారు. మ‌రోవైపు మూడో టెస్టులో ద్విశతకం సాధించిన ఛ‌టేశ్వ‌ర‌ పుజారా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో, విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నారు.


  • Loading...

More Telugu News