: కమలహాసన్ కు మరో చిక్కు... కేసు వేసిన హిందూ మక్కల్ కచ్చి
నటుడు కమల్ హాసన్ మహాభారతాన్ని, హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ, తమిళ సంస్థ హిందూ మక్కల్ కచ్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాలని కమల్ కు నోటీసులు పంపింది. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, పాంచాలిని జూదంలో పావులా వాడుకున్న మహాభారతాన్ని ఎందుకు గౌరవించాలని కమల్ వ్యాఖ్యానించారు. ఓ మహిళను అవమానానికి గురి చేసిన గ్రంధం మహాకావ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంఘాలు విమర్శలు గుప్పించాయి. హిందూమతంపై చేసిన ఇటువంటి వ్యాఖ్యలనే మరో మతంపై చేసే ధైర్యం కమల్ కు ఉందా? అని హెచ్ఎంకే కార్యదర్శి రవికుమార్ ప్రశ్నించారు. కమల్ కు వ్యతిరేకంగా తమిళనాట పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.