: అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ ఏపీ ముందుందని పొరపాటున చెప్పా: చంద్రబాబు
అవినీతిపై చర్చకు సిద్ధమా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి సవాలు విసిరారు. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలోనూ, అభివృద్ధిలోనూ ఏపీ ముందుందని తాను పొరపాటున చెప్పానని చంద్రబాబు అన్నారు. ఆ మాటను సరిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యుల రౌడీయిజాన్ని అరికట్టాలని ఆయన అన్నారు. తమ స్థాయిని దాటి గొడవలు పెట్టుకోవాలని ప్రతిపక్ష సభ్యులు చూస్తున్నారని అన్నారు. శాసనసభలో కాసేపు అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర నినాదాలు చేశారు.