: రాహుల్ గాంధీకి గిన్నిస్ బుక్ లో స్థానం ఇవ్వండి: మధ్యప్రదేశ్ విద్యార్థి చేసిన ఈ వింతైన ప్రపోజల్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!


వరుసగా తగులుతున్న ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టున పడేసేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్న వేళ, ఆయనకు గిన్నిస్ బుక్ లో స్థానం కల్పించాలని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు వింతైన ప్రతిపాదన పంపాడు. హోసంగాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విశాల్ దివాన్, గిన్నిస్ బుక్ కు దరఖాస్తు చేస్తూ, దేశంలో 27 ఎన్నికల్లో ఓటమిని చూసిన రాహుల్ గాంధీ పేరును గిన్నిస్ బుక్ కు ఎక్కించాలని కోరుతూ, అందుకు ఫీజు కూడా చెల్లించాడు. ప్రపంచంలో మరెవరూ ఇన్ని ఎన్నికల్లో ఓడిపోలేదని, ఎవరైనా ఓడివుంటే, ఆ విషయాన్ని తెలియజేయాలని, లేకుంటే రాహుల్ పేరు ఎక్కించాలని కోరాడు. ఈ మేరకు అతని దరఖాస్తును స్వీకరిస్తున్నట్టు గిన్నిస్ బుక్ అధికారుల నుంచి కన్ఫర్మేషన్ కూడా రావడం విశేషం.

  • Loading...

More Telugu News