: రూ. 100 విలువైన వాటాను 'ఈనాడు' రూ. 5.26 లక్షలకు అమ్మలేదా?: జగన్


వైఎస్ జగన్ కుటుంబం నిర్వహిస్తున్న సాక్షి దినపత్రికలో వాటాలను అధిక ధరలకు అమ్ముకున్నారని, దీనిద్వారా ఆయన వందల కోట్లు లాభపడ్డారని అధికార తెలుగుదేశం సభ్యులు సభలో ఆరోపించడంతో అంతే స్థాయిలో జగన్ నిప్పులు చెరిగారు. "సాక్షి అనే సంస్థ నేడు దేశంలోనే నంబర్ 8లో ఉన్న సంస్థ. చెక్ చేసుకోండి ఐఆర్ఎస్, ఏబీసీ రికార్డులు. 'ఈనాడు' అనే సంస్థ వంద రూపాయల షేరును ఐదు లక్షలా ఇరవై ఆరు వేల రూపాయలకు అమ్మినారు. 1800 కోట్ల ఆస్తులతో ఉంది ఈనాడు సంస్థ. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యుయేషన్ కన్నా సగం ధరకే సాక్షి సంస్థ ఇన్వెస్టర్లకు షేర్లను ఇచ్చింది. ఎక్కడా దీనిలో స్కాము లేదు. ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా మంచోళ్లు. ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా లాభాల్లోనే పయనిస్తున్నారు. ఈనాడులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నష్టపోలా, సాక్షిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నష్టపోలా. కాబట్టి మీ దగ్గరున్న రికార్డులన్నీ మార్చుకునే ప్రయత్నం చేయండి. మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు" అని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News