: సోనియాకు పాదాభివందనం చేయడం వల్లే జగన్‌కు బెయిల్ వచ్చింది!: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తులపట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు రగడ చెలరేగింది. ఐదేళ్లలో జగన్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అడిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ అక్రమంగా సంపాదించారని ఆయన ఆరోపించారు. పదిహేడు నెలలు జైలులో ఉన్న జగన్ కు కాంగ్రెస్ పార్టీయే బెయిలు ఇప్పించిందని ఆరోపించారు. సోనియాకు పాదాభివందనం చేయడం వల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. అది నిజమో కాదో జగన్ చెప్పాలని ఆయన అన్నారు. జగన్ కారణంగా అధికారులు జైలుకెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. వైఎస్ హయాంలోనే ఐఏఎస్‌లు చట్టవిరుద్ధచర్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.