: సొంత చిన్నాన్నను కూడా గెలిపించుకోలేకపోయిన జగనా మాట్లాడేది?: గంటా


వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని కూడా గెలుపించుకోలేక పోయిన జగనా, టీడీపీ గురించి మాట్లాడేది? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. జగన్ మతిస్థిమితం కోల్పోయారని... అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు జగన్ ఆరోపిస్తున్నారని... అయితే, లీక్ అయినట్టు ఎక్కడా ఆధారాలు లేవని అన్నారు. కడపలో బీటెక్ రవి గెలవడం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు పతిఫలం అని చెప్పారు. 

  • Loading...

More Telugu News