: అమెరికా దారిలోనే పయనిస్తోన్న సౌదీ అరేబియా.. విదేశీ కార్మికులపై నిబంధనలు!


అమెరికాతో పాటు సౌదీ అరేబియాలోనూ మ‌న‌దేశీయులు అధికంగానే ఉన్నారు. అయితే, అమెరికా బాట‌లోనే పయ‌నిస్తూ సౌదీ అరేబియా కూడా విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేస్తోంది. త‌ద్వారా సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించాల‌ని యోచిస్తోంది. త‌మదేశ పౌరుల్లో నిరుద్యోగం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అక్కడి ప్రభుత్వం తెలిపింది. విదేశీ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు పేర్కొంది. తాము తీసుకురానున్న‌ ఈ కొత్త పాలసీ వల్ల త‌మ దేశంలో నిరుద్యోగం 2020 నాటికి 12.1 నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తోంది.

త‌మ దేశంలో ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక‌ సంస్కరణల లక్ష్యం కూడా ఈ పాల‌సీతో నెరవేరుతుందని ఆ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ పాల‌సీ ప్రభావం సౌదీ అరేబియాలో తక్కువ వేతనాలకు, ప్రమాదకరమైన పనులు చేస్తున్న సుమారు 12మిలియన్ల మంది విదేశీ కార్మికులపై ప‌డనుంది. 500 నుంచి 2,999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్‌ ‘ప్లాటినమ్‌’ కేటగిరీలో వంద శాతం త‌మ దేశ‌ పౌరులనే ఉద్యోగాల్లో నియమించాల్సి ఉంటుంది. త‌మ దేశ పౌరుల‌కు పది శాతం మాత్రమే ఉద్యోగాలిస్తే ఆ సంస్థ‌ల‌కు ‘లోవర్‌ గ్రీన్‌’ కేటగిరీగా రేటింగ్‌ ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటింగ్‌ ప్లాటినమ్‌కు 16శాతం, లోవర్‌ గ్రీన్‌కు 6శాతంగా ఉంది.

  • Loading...

More Telugu News