: హత్య చేసిన కొడుకుకు సహకరించిన ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు!
తమ ఇంటి కారు డ్రైవర్ ను హత్య చేసిన ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట సుక్రుత్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. కేసు విచారణలో భాగంగా సుక్రుత్ ను విచారించిన పోలీసులు కారు డ్రైవర్ హత్యకు వెంకటేశ్వరరావు సహకరించాడని అనుమానిస్తున్నారు. దీంతో నేడు ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సుక్రుత్ కాల్ డేటాలో తండ్రితో పదేపదే మాట్లాడినట్టు ఉండటం, ఆయన కారు హత్య జరిగిన కల్యాణీ అపార్ట్ మెంట్ సీసీ ఫుటేజ్ లో కనిపించడంతో మృతదేహాన్ని తరలించేందుకు ఆయన సహకరించినట్టు అనుమానిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, వెంకటేశ్వరరావు గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే.