: జగన్ ను నమ్ముకుంటే పుట్టగతులు కూడా ఉండవు: బీటెక్ రవి


వైసీపీ అధినేత జగన్ ను నమ్ముకున్న వారందరికీ పుట్టగతులు కూడా ఉండవని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిపై గెలుపొందిన టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. జైలుకు వెళ్లే జగన్ ను నమ్ముకునే బదులు... నీతివంతమైన పాలనను అందిస్తున్న చంద్రబాబు నాయకత్వంలో పని చేయడమే మంచిదని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని... ఆయన పాలనను చూసే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనకు ఓటు వేశారని చెప్పారు. ఇకపై కడప జిల్లాలో టీడీపీ హవానే కొనసాగబోతోందని అన్నారు.  

  • Loading...

More Telugu News