: యూపీ కొత్త సీఎం ఎఫెక్ట్: హోటళ్లపై దాడులు చేసి 50 జంటలను అరెస్టు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాజారియా ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా దాడులు జరిపారు. ఈ నేపథ్యంలో రెండు హోటళ్లలో పోలీసులకు 50 జంటలు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తవాలీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హోటళ్లలో ఈ జంటలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల కారణంగానే వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారి తల్లిదండ్రులను పిలిపించి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆ రెండు హోటళ్లను పోలీసులు మూసివేశారు. ఆ రెండు హోటళ్ల యజమానులు ఢిల్లీ-ఎన్సీఆర్ మార్గంలో ఇటువంటి జంటలను ఆకర్షించి గంటల చొప్పున గదులను అద్దెకిస్తున్నట్టు పలు ఆరోపణలు వచ్చాయి.
ఆ రాష్ట్ర కొత్త సీఎం యోగి ఆదిత్యానాథ్... శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇటువంటి అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను పోలీసులు చర్యలకు దిగారు.