: జనగామ ఆసుపత్రిలో మూడు కాళ్లతో పాప జననం!
జనగామ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామ వాసి అయిన శ్రీలత మూడు కాళ్లతో ఉన్న ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జన్యుపరమైన లోపం కారణంగానే ఇటువంటి బిడ్డ జన్మించిందని వైద్యులు చెప్పారు. తమకు మూడు కాళ్లతో ఉన్న శిశువు జన్మించడం పట్ల శ్రీలత, ఆమె భర్త సాంబయ్య కొంత కలవరపాటుకు గురయ్యారు. ఆ దంపతులకు ఈ శిశువు రెండవ సంతానం. ఆ పాపను ఆసుపత్రిలోని ఇతర వ్యక్తులు ఆసక్తిగా చూసి వెళుతున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/3pZkfar3f7E" frameborder="0" allowfullscreen></iframe>