: జగన్ ఆడవాళ్లను ముందు ఉంచి, నీచరాజకీయాలు చేస్తున్నారు, ఆయనను చూసి సిగ్గుపడుతున్నా: అనిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ రోజు తీవ్రగందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ... ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆడవాళ్లను ముందు ఉంచి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనను చూసి సిగ్గుపడుతున్నామని అన్నారు. వైసీపీ సభ్యులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు.
తమకు నైతిక బలం ఉందని వ్యాఖ్యానించారు. జగన్ మాత్రం ఇటువంటి నీచరాజకీయాలకు చరమగీతం పాడాల్సిందేనని అన్నారు. తమకు న్యాయం కావాలని అన్నారు. తనను ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో కూడా మాట్లాడనివ్వట్లేదని, ఇక్కడ కూడా మాట్లాడనివ్వట్లేదని అన్నారు. నిజాలు బయట పెడుతున్నామనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మొదట మీడియా పాయింట్ వద్దకు తానే వస్తే తనను మాట్లాడనివ్వకుండా ప్రవర్తించారని అన్నారు.