: దద్దరిల్లిన అసెంబ్లీ మీడియా పాయింట్.. అనిత, గిడ్డి ఈశ్వరిల సవాళ్లు, ప్రతి సవాళ్లు


ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారశైలిపై అధికారపక్షం విరుచుకుపడగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతేకాదు, స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం సీన్ మీడియా పాయింట్ వద్దకు మారింది.

మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనిత, వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలు సవాళ్లు విసురుకున్నారు. తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగారు. సీఎం చంద్రబాబు తల నరుకుతానని తాను ఎన్నడూ అనలేదని, అది నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేయగా... సీఎం తల నరుకుతానని ఈశ్వరి అన్నట్టు పోలీసు విచారణలో తేలిందని అనిత కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఈశ్వరి అనగా... ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని అనిత మండిపడ్డారు. మరోవైపు, మైకుల కోసం ఇరు పార్టీల మహిళా ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దీంతో. మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, అక్కడకు మార్షల్స్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News