: 'అలగాజనం' అని ఎందుకు అన్నానో వివరణ ఇస్తా: చంద్రబాబు
అసెంబ్లీలో తాను అలగాజనం అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో సభలోనే వివరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభలో ఆ పదాన్ని తాను వాడటంపై, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెబుతూ, సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో వైకాపా సభ్యుల ప్రవర్తన, తాను ఎందుకు అలగాజనం అని అనాల్సి వచ్చిందన్న అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. నిన్న సభలో సీఎం మాట్లాడిన మాటలు తమను అగౌరవపరచడమేనని వైకాపాకు చెందిన దళిత, ఎస్సీ ఎస్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.