: అవినీతి సామ్రాజ్యానికి అధిపతి అయిన జగనా, నా గురించి మాట్లాడేది?: చింతమనేని
రెవెన్యూ అధికారిణి వనజాక్షి విషయంలో తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఓ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అవినీతి కేసుల్లో మునిగిపోయిన వ్యక్తులా తన గురించి మాట్లాడేది? అంటూ నిప్పులు చెరిగారు. అవినీతి సామ్రాజ్యానికి జగనే అధిపతి అని ఆరోపించారు. ఆయన తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అత్యంత అవినీతికి పాల్పడ్డ వ్యక్తి జగన్ అని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో చింతమనేని మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. పద్ధతి మార్చుకోకపోతే జగన్ కు ప్రతిపక్షనేత హోదా కూడా ఉండదని చింతమనేని అన్నారు. వనజాక్షి విషయంలో నా తప్పు ఉందని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.