: భార్య భువనేశ్వరితో కలసి షాపింగ్ చేసిన చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన భార్య భువనేశ్వరితో కలసి కాసేపు సరదాగా షాపింగ్ చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన హస్తకళల మేళాను భువనేశ్వరితో కలిసి ప్రారంభించిన ఆయన, పలు స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. తనకు నచ్చిన హస్తకళా వస్తువులను భువనేశ్వరి కొనుగోలు చేస్తుంటే, వాటిని తయారు చేసిన విధానాన్ని, ధరను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనకు ఉంచిన చేనేత, హస్తకళల స్టాళ్లను పరిశీలిస్తూ వారిద్దరూ కలయదిరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తయారైన వస్తువులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. హస్తకళలకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News