: మీరే మాట్లాడి తేల్చుకోండి: రంభ దంపతులకు కోర్టు ఆదేశం


భర్తతో తనను కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ. 2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని నటి రంభ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ఇది కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కెనడాకు చెందిన ఇంద్రకుమార్ ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఆపై భర్తతో గొడవపడి, చెన్నైకి వచ్చేసిన రంభ, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, ఆమెను, ఇంద్రకుమార్ ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. సమస్య పరిష్కారం కాకుంటే, తాము కల్పించుకుంటామని తేల్చింది.

  • Loading...

More Telugu News