: రాజీనామా చేస్తున్నా... గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
ప్రజల ఆకలి చావులను పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోధా సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేసిన ఆయన, మరికాసేపట్లో కేసీఆర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తున్నట్టు ప్రకటించారు.
ధూల్ పేటలో గుడుంబా తయారీని మానేసిన వేలాది మందికి ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే తాను ప్రశ్నిస్తే, స్వయంగా ధూల్ పేటకు వచ్చి, ప్రజలను ఆదుకునే చర్యలు చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇంతవరకూ దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాగా, రాజాసింగ్ కు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.