: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖరరెడ్డిని వీడని కష్టాలు... జైలు నుంచి బయటకు రాగానే తిరిగి అరెస్ట్


టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని ఇంకా కష్టాలు వీడలేదు. రద్దయిన నోట్ల మార్పిడి కేసులో అరెస్టయి, ఇంతకాలం జైల్లో ఉండి, ఇప్పుడు బెయిల్ పై విడుదలైన ఆయన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్రమంగా ఆస్తులను కలిగివున్నారని ఆరోపించిన ఈడీ, ఆయన్ను అదుపులోకి తీసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసులు ప్రేమ్ కుమార్ లనూ ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై శేఖర్ రెడ్డిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి, ఈ నెల 28 వరకూ కస్టడీకి అనుమతి పొందింది.

  • Loading...

More Telugu News