: ఐపీఎల్ లో అనుకోని అవాంతరం... వేదిక మార్పు!


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2017లో అనుకోని అవాంతరం ఎదురైంది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌ లో మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 22న ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తలపడాల్సి ఉంది. అయితే ఆ రోజు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కారణంగా ఈ మ్యాచ్ ను ముంబైకి మార్చారు. ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మ్యాచ్, వేదిక మార్చినందున ముంబైలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని ఐపీఎల్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఈ రెండు జట్ల మధ్య ఢిల్లీలో మే 6న జరగాల్సిన మ్యాచ్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ వెల్లడించింది. ఏప్రిల్ 5న ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 21న ముగియనుంది. 

  • Loading...

More Telugu News