: కేపీహెచ్బీ లేడీస్ హాస్టల్ లో సహచరులపై యువతి వేధింపులు.. అరెస్ట్!
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి, అడ్డగుట్టలోని ఒక లేడీస్ హాస్టల్ లో స్నేహితులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో విజయ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే... అడ్డగుట్టలోని ఓ లేడీస్ హాస్టల్ లో విజయ అనే యువతి ఉంటోంది. తన రూంలోని మరో యువతితో స్నేహంగా ఉన్న విజయ, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి తను పనిచేసే సంస్థ యజమానికి పంపింది.
అంతటితో ఆగని ఆ యువతి స్నేహితురాలి ఫోన్ నెంబర్ కూడా వారికి పంపింది. దీంతో వారి నుంచి ఆమెకు వేధింపులు పెరిగిపోయాయి. ఈ వేధింపులు భరించలేని యువతి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విజయను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హాస్టల్ లో మరి కొంత మంది ముందుకువచ్చి, విజయ తమను కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేబట్టారు.