: ఢిల్లీ డేర్ డెవిల్స్ కు షాక్... ఐపీఎల్ నుంచి తప్పుకున్న డుమిని!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2017 మొదలయ్యేందుకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు షాక్ తగిలింది. 2015లో ఆ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమిని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి వైదొలిగాడని ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ దువా వెల్లడించారు. డుమిని వైదొలగడం తమను నిరాశపరిచిందని ఆయన అన్నారు. అయితే ఆయన పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని ఆయన తెలిపారు. ఐపీఎల్ నుంచి వైదొలగే క్రమంలో డుమిని ప్రతిభావంతులతో కలిసి ఆడడం గొప్ప అనుభూతి అని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడని ఆయన తెలిపారు.