: ‘అలగా జనం’ వ్యాఖ్యలపై.. సీఎం చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్న వైఎస్సార్సీపీ!


ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘అలగా జనం’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని, అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ మొదలైన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ కు రేపు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు సమాధానమిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘అలగాజనం’ అని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News