: మంచు లక్ష్మి, కూతురు విద్యా నిర్వాణ డ్యాన్స్ చూడండి!


మంచు లక్ష్మి, తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి స్టెప్పులేసింది. తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలలో ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలతో పాటు పాఠశాల 25వ వార్షికోత్సవాన్ని కూడా నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి, తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేసింది. తన కూతురుని ఉత్సాహపరుస్తూ ఆమె కూడా స్టెప్పులు వేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తల్లీకూతుళ్ల డ్యాన్స్ చూడొచ్చు. అంతేకాకుండా, మంచు విష్ణు హీరోగా నటిస్తున్న‘ఆచారి అమెరికా యాత్ర’ ముహూర్తపు షాట్ కూడా ఈ పాఠశాలలోనే ప్రారంభించడం విశేషం.

  • Loading...

More Telugu News