: మూడో టెస్టులో రెండు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్ (2016-17) లో అత్యధిక వికెట్లు (78) తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సఫారీ ఆటగాడు డెల్ స్టెయిన్ పేరిట ఉండేది. 2007/08 సీజన్ లో బౌలర్ డెల్ స్టెయిన్ ఒక సీజన్ లో 78 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మూడో టెస్టుతో ఈ సీజన్ లో 78 వికెట్లు తీసిన అశ్విన్, స్టెయిన్ రికార్డును సమం చేశాడు.