: 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఛటేశ్వర్ పుజారా రికార్డు!
జార్ఖండ్ లోని రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా డబుల్ సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా నిలిచాడు. మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచిన పుజారా... సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ చేశాడు. టీమిండియా సహచరులంతా స్వల్ప స్కోరుకే వెనుదిరుగుతున్న వేళ సెంచరీ స్టార్ సాహా అండతో రికార్డు స్థాయిలో 525 బంతులు ఆడి 202 పరుగులు చేశాడు. 38.48 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన పుజారా డబుల్ సెంచరీ చేసేందుకు గతంలో ఏ భారతీయుడు ఎదుర్కోనన్ని బంతులు ఎదుర్కొన్నాడు. ఒక దశలో పుజారాను ఔట్ చేయండం సాథ్యం కాదేమో అనే భావన ఆసీస్ బౌలర్లలో కనిపించడం విశేషం.