: గోవధ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం: ఉత్తరాఖండ్ కొత్త సీఎం త్రివేంద్రసింగ్
ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ తాజాగా మాట్లాడుతూ... గోవధ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. అలాగే తమ మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు ఆదేశాలు జారీ చేస్తూ.. ఏడాదికి ఒకసారి తమ ఆస్తుల వివరాలను తప్పకుండా అందివ్వాలని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎంతో వెనుకబడి ఉందని, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. కొత్త మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే మార్గాలను కనిపెడుతున్నామని అన్నారు.