: జ్యోతిష్య శాస్త్రవేత్త నోస్ట్రడామస్‌ అనాడే చెప్పారు.. ఆయన చెప్పిన వ్యక్తే మోదీ: ఎంపీ కిరిత్‌ సోమయ్య


తూర్పు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్భవించి భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తారని ఫ్రాన్స్‌ దేశానికి చెందిన జ్యోతిష్య శాస్త్రవేత్త నోష్ట్రడామస్‌ అనాడే చెప్పారని ఎంపీ కిరిత్‌ సోమయ్య వ్యాఖ్యానించారు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్య‌క్తి ఎవ‌రో కాద‌ని, మోదీయేన‌ని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ అంశంపై చ‌ర్చించినా ప్ర‌తిప‌క్షాలు అందులోకి పెద్ద నోట్ల రద్దు విషయాన్ని తీసుకొచ్చి గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయ‌ని అన్నారు.

1547లో జ‌న్మించిన నోస్ట్రడామస్ త‌న‌ గ్రంథం సెంచరీస్‌లో చెప్పిన విష‌యాల‌న్నీ జ‌రుగుతాయ‌ని ప‌లువురు విశ్వ‌సిస్తారు. అందులో హిట్లర్‌ గురించి, 2001లో అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి గురించి కూడా ఉంద‌ని పేర్కొంటారు.

  • Loading...

More Telugu News