: జగన్ తన సొంత బాబాయినే గెలిపించుకోలేకపోయారు!: సతీశ్ రెడ్డి


కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జగన్ తన సొంత బాబాయినే గెలిపించుకోలేకపోయారని ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ సొంత పార్టీ నేతలే ఆయన్ని నమ్మడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన 500 పైగా ఎంపీటీసీలు వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు బలపర్చలేదో జగన్ తెలుసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలు రాక ముందు వరకు తమదే విజయం అని చెప్పిన జగన్, ఫలితాల తర్వాత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ప్రజలకు విశ్వాసం లేదని చెబుతున్న జగన్ కు ధైర్యం ఉంటే కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ స్థానాలకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News