: యూపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలిచింది.. ఎన్నికలపై కోర్టుకు వెళతా: మాయావతి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో... ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ అంశంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె ఈ రోజు మీడియాకు తెలిపారు. ఈ చర్యకు పాల్పడే బీజేపీ విజయాన్ని సాధించిందని ఆమె అన్నారు. ఈ అంశంలో న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ ఆరోపణలన్నీ నిరాధారమని, ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.