: వందేళ్ల మూడంతస్తుల భవనం అమ్మకానికి....ధర 52 కోట్లే!
అమెరికాలో ల్యాండ్ మార్క్ గా నిలుచున్న వందేళ్లపైబడ్డ మూడంతస్తుల భవనాన్ని అమ్మకానికి పెట్టారు. క్రీస్టీస్ సంస్థ ఈ భవనాన్ని విక్రయించనుంది. టెక్సాస్ లో ఉన్న ఈ భవనం పేరు బాల్ డ్రిడ్జ్ హౌస్. దీని యజమాని ఎర్ల్ బాల్ డ్రిడ్జ్ పేరుతోనే దీనిని పిలుచుకుంటారు. దీనిని ఆయన 1910లో ప్రారంభించి 1913 నాటికి పూర్తి చేశారు. బ్యాంకు ఉద్యోగి అయిన ఎర్ల్ బాల్ డ్రిడ్జ్ తను నిర్మించబోయే భవనం లాంటిది మరెవరి వద్దా ఉండకూడదనుకున్నారు. దీంతో ఆయన టెక్సాస్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచిన ఈ భవనాన్ని నిర్మించారు.
1978లో ప్రభుత్వం ఈ భవనాన్ని ఒక లాండ్ మార్క్ గా గుర్తించింది. 107 ఏళ్ల చరిత్ర గల ఈ పురాతన భవనాన్ని 8 మిలియన్ డాలర్లు (52 కోట్ల రూపాయల)కు అమ్మకానికి పెట్టారు. 14000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవనంలో ఆరు బెడ్ రూమ్ లు ఉన్నాయి. దీనిని 2007లో పీటర్ అనే వ్యక్తి కోనుగోలు చేశాడు. అతని ఇద్దరు కుమార్తెలు డాలస్ లో స్థిరపడ్డారు. దీంతో ఆయన కూడా వారి వద్దే తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దీనిని మార్కెట్ రేటు ప్రకారం 52 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు నిర్ణయించారు.