: 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...చెమటోడుస్తున్న టీమిండియా


టీమిండియా బౌలర్లు దూకుడు పెంచారు. ఒక ఎండ్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ దాడి చేస్తుండగా, మరో ఎండ్ నుంచి రవీంద్ర జడేజా సుడులు తిరుగుతున్న బంతులతో విరుచుకుపడుతున్నాడు. విజయమే లక్ష్యంగా వీరిద్దరూ ఆసీస్ ను పెవిలియన్ కు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హ్యాండ్స్ కోంబ్ (88) క్రీజులో పాతుకుపోవడంతో మరో ఎండ్ లో ఉన్న ఆటగాళ్లపై వీరు దాడిని పెంచారు. ఈ క్రమంలో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న షాన్ మార్ష్ (53) ను రవీంద్ర జడేజా అవుట్ చేయగా, అనంతరం వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ స్టార్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (2)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 190 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజులో హ్యాండ్స్ కోంబ్ కు జతగా మాథ్యూ వేడ్ (5) ఆడుతున్నాడు. 

  • Loading...

More Telugu News