: ఘనాలో విషాదం.. చెట్టు కూలి 20 మంది విద్యార్థుల మృతి, 15 మందికి గాయాలు
జలపాతం దగ్గర సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులపై ఓ భారీ వృక్షం కూలడంతో... 20 మంది విద్యార్థులు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయిన విషాదకర ఘటన ఆఫ్రికా దేశం ఘనాలో చోటుచేసుకుంది. గాయాలపాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన సహాయక బృందాలు వారికి చికిత్స అందిస్తున్నాయి. ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థులంతా విహారయాత్రకు వచ్చారని, వాటర్‌ఫాల్స్ దగ్గర ఈతకు దిగిన సమయంలో తుపాన్ వచ్చిందని, అకస్మాత్తుగా భారీ వృక్షం విద్యార్థులపై కుప్పకూలిందని చెప్పారు.