: టీడీపీపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి


ఈ రోజు వెలువడ్డ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, టీడీపీపై పలు ఆరోపణలు చేయడమే కాకుండా, మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా? అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు పోలీసుల సాక్షిగా కిడ్నాప్ లు చేయించారని, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వందల కోట్ల రూపాయలను టీడీపీ ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రాలో ఉన్నామో లేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామో అర్థం కావట్లేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News