: జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది: టీడీపీ


వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. జగన్ సొంత జిల్లా కడపలో ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం దీనికి అద్దంపడుతోందని చెప్పారు. జగన్ కుటుంబం అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటుందని... అరాచకాలు జరగకపోతే పులివెందులలో కూడా ఇవే ఫలితాలు వస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో అరాచకాలు పనికిరావని అన్నారు. కడపకు నీళ్లిచ్చినా జగన్ కుళ్లుకుంటారని... 2019 ఎన్నికల్లో జగన్ కు రాజకీయంగా పుట్టగతులు కూడా ఉండవని తెలిపారు. కడపలో విజయం టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిది కాదని... అది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు.

  • Loading...

More Telugu News