: యూపీలో చిన్న, స‌న్న‌కారు రైతుల‌కు మాత్ర‌మే రుణ‌మాఫీ ప్ర‌క‌టించారు: చంద్ర‌బాబు


దేశంలో ఎక్క‌డా లేని విధంగా రూ.24 వేల కోట్ల రైతు రుణాలను విముక్తి చేసిన ఘ‌న‌త ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానిదేన‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... మిగులు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణలో కూడా రైతుల‌కు రూ.లక్ష చొప్పునే ఇస్తున్నారని... కానీ, తాము మాత్రం రూ.ల‌క్ష‌న్న‌ర ఇస్తున్నామ‌ని అన్నారు. యూపీలో కూడా చిన్న, స‌న్న‌కారు రైతుల‌కు మాత్ర‌మే రుణ‌మాఫీ ప్ర‌క‌టించారని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం పులివెందుల‌కు కూడా నీళ్లిస్తోంద‌ని, ఇకపై అక్కడ వైసీపీకి ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా ద‌క్క‌బోవ‌ని అన్నారు.

ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారికి నిధులు కేటాయించామ‌ని చంద్రబాబు చెప్పారు. పోల‌వ‌రంకు ఎదురైన అన్ని అడ్డంకుల‌ను అధిగమించి ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామ‌ని, విదేశాల్లో చ‌దువుకు అర్హులైనవారికి రూ.10ల‌క్ష‌లు అందిస్తున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో ప‌లు ప్రాంతాల్లో 'అన్న క్యాంటీన్ల‌'ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించామ‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల‌కు 75 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో దోమలపై దండయాత్ర చేస్తున్నామని, ఇక‌పై రౌడీలు, నేరచరితులపై కూడా దండయాత్ర చేస్తామని ఆయ‌న ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News