: సుశీల్ మోదీకి ట్విట్టర్ లో 'సూపర్ పంచ్' ఇచ్చిన లాలూ!


ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. "యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన్ను ఎలా విమర్శించాలో కూడా తెలియని దిగ్భ్రాంతికర స్థితిలో లాలూ ఉన్నారు" అని సుశీల్  ట్వీట్‌ చేయగా, దానిపై స్పందించిన లాలూ 'సూపర్ పంచ్'ని వదిలారు.

"ప్రమాణ స్వీకారానికి నిన్ను పిలువలేదని బాధపడిపోకు. నువ్వు కూడా గుండు గీయించుకో, చెవులు కుట్టించుకో. వేసుకునే దుస్తులు మార్చుకో. ఇది నీకు మేలు చేయవచ్చు" అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సన్యాసం స్వీకరించాలని సుశీల్ మోదీని ఉద్దేశించి లాలూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకుముందు సైతం, యూపీలో బీజేపీ గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "లాలూ మీ పరిస్థితి ఏమిటి?" అని మోదీ ప్రశ్నించగా, తాను బాగానే ఉన్నానని చెబుతూ, "నిన్ను యూపీలోకి అడుగుపెట్టనివ్వలేదు. కాబట్టే, అక్కడ బీజేపీ గెలిచింది" అంటూ కౌంటర్‌ వేశారు.

  • Loading...

More Telugu News