: ట్రంప్ కు రష్యా సాయం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కమిటీ ముందుకు ఎఫ్‌బీఐ, ఎన్ఎస్ఏ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి ప్రచారంలో పాల్గొంటున్న వేళ ఆయనకు రష్యా సాయం చేసినట్లు ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంతో పాటు అప్పటి అధ్యక్షుడు ఒబామా.. ట్రంప్ ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేయించారన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ, ఎన్ఎస్ఏలు కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట సమాధానం ఇవ్వనున్నాయి. మరోవైపు ఆ దేశ అధ్యక్ష ఎన్నికల సమయంలో తమ దేశానికి చెందిన గూఢచారులు ప్రభావితం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన రష్యా ఇప్పటికే ఆ ఆరోపణలను ఖండించింది. కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ ముందు ఎఫ్‌బీఐ, ఎన్ఎస్ఏలు ఇచ్చే సమాధానంపై ఆసక్తి నెలకొంది.