: యోగి ఆదిత్యనాథ్ ను సీఎంగా ఎంపిక చేయడానికి కారణాలు ఇవే!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలుత పలువురి పేర్లు వినిపించినప్పటికీ, చివరకు ఆ పదవిని యోగి ఆదిత్యనాథ్ చేజిక్కుంచుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎంపిక చేయడం చర్చనీయాంశం అయింది. అయితే, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఎంతో నిరాడంబరంగా ఉండే యోగి జీవన విధానం మోదీ, అమిత్ లకు ఎంతో నచ్చిందట. ఆయనకు జనాల్లో ఉన్న ఆదరణ, క్రమశిక్షణ, పార్టీ కోసం కష్టపడే తత్వం  వారిని యోగివైపు మొగ్గుచూపేలా చేశాయి. ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విముఖత వ్యక్తం చేయడంతో, అదృష్టం యోగిని వరించింది. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా యోగి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఈ కారణాలన్నింటి వల్లే పార్టీ అధిష్ఠానం యోగిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News