: యూపీలో దారుణం... బీఎస్పీ నేత మొహమ్మద్ షమీ కాల్చివేత
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన పలువురు దుండగులు బీఎస్పీ పార్టీ నేత మొహమ్మద్ షమీని గుర్తు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఆగ్రహించిన కొందరు ఆ పార్టీ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ స్పందిస్తూ... రాష్ట్ర ప్రజల రక్షణే తమకు ముఖ్యమని, నేరాలను ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని చెప్పారు. నిన్న రాత్రి అలహాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.