: ఢిల్లీలో పాదయాత్ర చేసిన కరుణానిధి కుమార్తె కనిమొళి


డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి నేడు ఢిల్లీలో పాదయాత్ర చేశారు. వివరాల్లోకి వెళ్తే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలని డిమాండ్ చేస్తూ.. డీఎంకే మహిళా విభాగం ఈ ఉదయం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా కనిమొళి నేతృత్వంలో ఆ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా కనిమొళి మీడియాతో మాట్లాడుతూ, ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నప్పటికీ... గత 20 ఏళ్లుగా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు గొంతు విప్పాలని ఆమె కోరారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమెదించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీకి లేఖ రాశారు.

  • Loading...

More Telugu News