: అంతా నీ కష్టమే: గంటాకు చంద్రబాబు అభినందనలు
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు దక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ వెనుక మంత్రి గంటా కృషి ఎంతో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్న అనంతరం, గంటాను చంద్రబాబు అభినందించారు. నిత్యమూ ఎన్నికలపై దృష్టిని సారించి వైకాపా కుయుక్తులను గంటా సమర్థవంతంగా అడ్డుకున్నారని, ఆయన కష్టం ఇప్పుడు మూడు విజయాల రూపంలో పార్టీకి లాభించిందని అన్నారు. ఇతర నేతలు సైతం ఇదే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.