: చోరీ అయ్యాయనుకున్న ధోని ఫోన్లు దొరికాయ్!


టీమిండియా క్రికెట‌ర్‌ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన మూడు ఫోన్లు క‌నిపించ‌కుండా పోవ‌డంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ఫోన్‌లు చోరీకి గురికాలేద‌ట‌. ధోనీ బ‌స ఉంటున్న హోట‌ల్‌ అగ్ని ప్రమాద సమయంలో ఆటగాళ్లను వేరే ప్రాంతానికి తరలించే క్ర‌మంలో ఆ ఫోన్ల‌న్నింటినీ అగ్నిమాపక సిబ్బంది తీసి భద్రంగా ఉంచార‌ట‌. ఆ ఫోన్లను తిరిగి తీసుకున్న‌ పోలీసులు వాటిని ధోనీకి అప్పగించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీలోని వెల్‌కమ్ హోటల్‌లో ఝార్ఖండ్ జట్టు బస చేసింది. అయితే, అగ్ని ప్రమాదం జ‌రిగిన కార‌ణంగా క్రికెటర్లు హోట‌ల్ బ‌య‌ట‌కు వచ్చేశారు. అనంత‌రం త‌న‌ ఫోన్లు కనపడకపోవడంతో ధోనీ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ పుటేజీల ఆధారంగా ఆరా తీసి మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు ఆ ఫోన్లను తనతో తీసుకెళ్లినట్లు గుర్తించారు. అయితే, ఈ కేసు విషయం తెలిసి అతను తిరిగి వాటిని పోలీసుల‌కు అప్పగించాడు. ఆ ఫోన్లు ఎవరివో తెలియక వాటిని తన వద్దనే ఉంచుకున్నట్లు ఆ వ్య‌క్తి పేర్కొన్నాడు. ఇది పొరపాటే తప్ప దొంగతనం కాదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News