: సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా స్మార్ట్ ఫోన్
సెల్ఫీ ప్రేమికుల కోసం వివో సంస్థ 'వై 66' పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను నేటి నుంచి మార్కెట్లో విక్రయించనుంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత, క్రౌన్ గోల్డ్, మాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండే ఫోన్ ధర రూ. 14,999గా సంస్థ నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఫోన్ లో 5.5 అంగుళాల డిస్ ప్లే, 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి సదుపాయాలున్నాయి. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ బరువు 155 గ్రాములేనని వివో ప్రకటించింది.