: ప్రతి కార్యకర్తా ‘బాహుబలి’ అవ్వాలి.. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి: జానారెడ్డి


దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ప్రభావం రాజకీయ నాయకులపై కూడా బాగానే పడింది. ఇటీవ‌లే సీఎల్పీ నేత జానారెడ్డి బాహుబ‌లి వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటిని టీఆర్ఎస్ నేత‌లు అదే విధంగా తిప్పికొట్ట‌డం తెలిసిందే. తాజాగా జానారెడ్డి ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ మళ్లీ బాహుబ‌లి అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా ఒక బాహుబలి కావాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర‌ ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మ‌రో 45 రోజుల్లో త‌మ‌ పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పార్టీ కార్య‌క‌ర్త‌లంతా సమన్వయంతో పని చేయాలని జానారెడ్డి సూచించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు కూడా నాలుగు సీజన్‌లకు సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయలేదని విమ‌ర్శించారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో నీటిని విడుదల చేసినప్ప‌టికీ పాల‌కులు, అధికారుల అవగాహన లోపంతో పంట‌లు రైతుల చేతికందే ప‌రిస్థితులు ఎక్క‌డున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News