: రేసర్ అశ్విన్ సుందర్ దుర్మరణానికి స్పీడ్ బ్రేకరే కారణం!


భారతీయ రేసర్ అశ్విన్ సుందర్, అతని భార్య నివేదిత దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. చెన్నైలో వారు ప్రయాణించిన బీఎండబ్ల్యూ కారు చెట్టును ఢీకొని, ఆ తర్వాత అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో వీరిద్దరూ సజీవ దహనం అయ్యారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఓ స్పీడ్ బ్రేకరే అని వారు ప్రయాణించిన కారు ఇంజినీర్ రాజా తెలిపారు.

వారు అధిక వేగంతో వెళుతున్న సమయంలో, కారు కింద భాగం స్పీడ్ బ్రేకర్ కు రాసుకుని అదుపుతప్పి ఉంటుందని ఆయన విశ్లేషించారు. అశ్విన్ ప్రయాణించిన బీఎండబ్ల్యూ కారులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంటుందని చెప్పారు. దీని ఖరీదు రూ. కోటి వరకు ఉంటుందని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కార్లలో భద్రతా ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఉంటాయని... స్పీడ్ బ్రేకర్ రాసుకోవడం వల్లే నిప్పు అంటుకుని ఉండవచ్చని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News