: సీఎం ఇంటి ముందు హైడ్రామా... రోడ్డుపై బైఠాయించిన పలాస ఎమ్మెల్యే శివాజి


నిత్యమూ కట్టుదిట్టమైన భద్రత, పోలీసు పహారా ఉండే సీఎం చంద్రబాబు నివాస ప్రాంతం వద్ద హైడ్రామా నడుస్తోంది. సీఎం నివాస ప్రాంతమైన ఉండవల్లికి దారితీసే రహదారిపై పలాస ఎమ్మెల్యే శివాజీ బైఠాయించి తన నిరసన తెలుపుతుండటమే ఇందుకు కారణం. సీఎం కాన్వాయ్ వస్తుందంటూ, పోలీసులు తనను పక్కన నిలిపివేశారని ఆరోపిస్తూ, ఆయన నిరసనకు దిగారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను పోలీసులు అగౌరవ పరిచారని ఆరోపించారు.

తన కారు సీఎం కాన్వాయ్ కన్నా ముందే ఉండవల్లిని దాటి ఉండేదని, అకారణంగా పోలీసులు ఆపివేశారని, శాసన సభ్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం, శివాజీని బుజ్జగించేందుకు మంత్రి అచ్చెన్నాయుడిని పంపారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకుంటామని, నిరసన విరమించాలని అచ్చెన్నాయుడు కోరగా, పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, శివాజీ మాత్రం తన నిరసన కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News